అక్కచెల్లెమ్మల రుణం తీర్చుకుంటా..

అక్కచెల్లెమ్మల రుణం తీర్చుకుంటా..

Share

పాడి పరిశ్రమ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అమ్మ డెయిరీ ద్వారా డెయిరీలో వచ్చే లాభాలు కూడా సభ్యులకే అందజేస్తాం. పాడి పరిశ్రమ పెరగడానికి మహిళలకు ఆవులకు, గేదెలకు సంబంధించి బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు వచ్చేలా ఏర్పాటు చేశాం.
దరఖాస్తులు బ్యాంకు వారు తీసుకున్నారు. వాటిని పరిశీలించి రుణాలు అందజేలా చేస్తాం. అర్హతను బట్టి సబ్సిడీ రుణాలు కూడా వచ్చేలా చేస్తాము.

10 వేలమంది పాడి మహిళా రైతుల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ డెయిరీ పాల నాణ్యతను ఒకసారి చూడండి అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫ్రీ శాంపిల్‌ పాకెట్లను శనివారం పది వేల ఇళ్లకు సరఫరా చేశారు.
పాపంపేట, కక్కలపల్లి కాలనీ పంచాయతీలతో పాటు చిన్మయానగర్‌లో మహిళలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా తిరిగి అమ్మ డెయిరీ పాల పాకెట్లను మహిళలకు అందజేశారు. ఆదివారం అనంతపురం రూరల్ నందు శాంపిల్‌ పాకెట్లు అందజేస్తారని
ఎమ్మెల్యే గారు తెలిపారు. పది రోజుల్లో లక్ష ఇళ్లకు శాంపిల్స్‌ ఇస్తారు. అమ్మ డెయిరీ పాలు డోర్‌ డెలవరీ ఇస్తారని తెలిపారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలని,
న్యాయమైన ధర కల్పించాలనే ఉద్దేశంతో అమ్మ డెయిరీ ఏర్పాటు చేశాం. అమూల్‌ కంటే కూడా లీటరుపై రూపాయి అదనంగా ధర చెల్లిస్తాం. 90 రోజుల తర్వాత వచ్చే లాభాలను లెక్కించి వాటాలుగా తిరిగి రైతులకు ఇస్తామని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *