పరిటాల ఫ్యామిలీరాప్తాడు సకుటుంబ సమేత ‘రక్తచరిత్ర’!
2014లో ఏర్పాటైన బాబు ప్రభుత్వంలో మంత్రి అయినా పరిటాల సునీత కొడుకుతో కలిసి అరాచకాలు, దోపిడీలకు తెగబడ్డారు.
కిరాతకాలు
2015 ఏప్రిల్ 29న పట్టపగలు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని టీడీపీ నేతలు అతి దారుణంగా హత్య చేశారు.
2018 మార్చి 30న అనంతపురం రూరల్ మండలం కందుకూరులో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు శివారెడ్డిని దారుణంగా హత్య చేశారు.
2018 అక్టోబరు 10న ఆత్మకూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు గూలి కేశవరెడ్డిని హత్య చేశారు.
అక్రమాలెన్నో..
అప్పటి మహిళా మంత్రి అండదండలతో రాప్తాడులో రూ.4 కోట్ల విలువైన పండమేటి వెంకట రమణ స్వామి ఆలయ మాన్యంలో అక్రమంగా టీడీపీ కార్యాలయ భవనాన్ని నిరి్మంచారు.
పలు గ్రామాల్లో నీరు–చెట్టు పథకం ద్వారా చేపట్టిన పనుల్లో రూ. 200 కోట్లపైనే దోచేశారు.
ప్రసన్నాయపల్లి పంచాయతీలోని చిన్మయనగర్‌లో రోడ్డు విస్తరణ పేరిట మంత్రి ఆదేశాలతో దాదాపు 120 ఇళ్లతో పాటు దుకాణాలను కూలి్చవేశారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపలేదు. ఇక్కడ రైల్వే స్టేషన్ సమీపంలోని సర్వే నంబర్ 343/2ఏలోని 70 సెంట్ల స్థలాన్ని అప్పటి మహిళా మంత్రి తనయుడి అనుచరుడి పేరిట ఆక్రమించారు. అప్పట్లోనే ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.4 లక్షలకుపైగా ఉండేది.
సిద్ధారాంపురం గ్రామ సర్వే నంబర్ 524లోని 92 ఎకరాల ప్రభుత్వ భూమి (గ్రామ కంఠం)కి మండల ఇన్‌చార్జ్, మంత్రి సోదరుడు తన అనుచరుల పేరిట పట్టా చేయించాడు. దీనిపై గ్రామస్థులు అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
చెర్లోపల్లి, పాపిరెడ్డి గ్రామాల సమీపంలో 300 ఎకరాల భూములను టీడీపీ నాయకులు కాజేసి, వాటిని ప్రైవేటు కంపెనీలకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు.
కోనాపురం గ్రామం దగ్గర హంద్రీ–నీవా కాలువ నుంచి ఎం.బండమీదపల్లి చెరువులోకి నీటిని తరలించేందుకు రూ.8 కోట్లతో కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. ఆ పనులు అప్పటి ఎంపీపీకి రావడంతో నాటి మహిళా మంత్రి చక్రం తిప్పి ఆ పని తన తమ్ముడికి ఇప్పించారు.. నాణ్యత లేకుండా పనులు చేసి భారీగా సొమ్ము వెనకేసుకున్నారు. మీరు బ్రాస్లెట్ కోసం చూస్తున్నట్లయితే. బాడీ-హగ్గింగ్ నుండి స్ట్రక్చర్డ్ వరకు, కఫ్‌ల నుండి చైన్ మరియు కఫ్‌ల వరకు ప్రతి రూపానికి సరిపోయేవి ఉన్నాయి.
44వ జాతీయ రహదారి సమీపంలో దాదులూరు గ్రామంలోని నాదారు చెరువును టీడీపీ నాయకులు ఆక్రమించారు. పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు చేయించుకుని.. గాలి మరలు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల కోసం వాటిని ఇచ్చి సొమ్ము చేసుకున్నారు.
రహదారుల నిర్మాణంలోనూ భారీ అవినీతికి పాల్పడ్డారు.
కురుగుంట సమీపంలోని సర్వే నంబర్ 133/4లో మూడు ఎకరాల ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులపై మహిళా మంత్రి ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఇక్కడ 105 మందికి పట్టాలను మంజూరు చేయాల్సి ఉండగా 60 మందికి మాత్రమే అందజేసి… మిగిలిన 45 ఇంటి పట్టాలను తమ అనుచరుల చేత ఒక్కొక్క పట్టా రూ.2 లక్షల వరకు విక్రయింపజేశారు.