ఈ యుగాది సంక్షేమ పాలన పునరావృతానికి నాంది కావాలి-ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ఉగాది అంటే యుగానికి ఆది అని అర్ధం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది ‘యుగాది’ లేదా ‘ఉగాది’ అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి అప్పటినుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. అలాంటి యుగాది జరుపుకుంటున్న రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ తెలుగు సంవత్సరాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని దేవతా మూర్తులకు ప్రార్థించారు. భగవంతుడి సంకల్పంతో, ప్రజల ఆశీస్సులతో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధిగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఐదేళ్ల క్రితం రాక్షస పాలనను అంతమొందించి, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించిన నాటినుండి ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్న తమను ఆశీర్వదించాలని కోరారు. ఈ ఐదేళ్ల పాలనలో ఎలాంటి ఫ్యాక్షన్, అవినీతి లేని పాలన అందించామని తెలిపారు.