కందుకూరు లో నూతన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను ప్రారంభించిన రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు..!
చంద్రబాబు దోచుకుంటే…జగనన్న పంచి పెట్టాడు..!
మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరో మీరే చెప్పండి..!
కందుకూరులో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లోనూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారికి ఘన స్వాగతం..!
‘గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఏ ప్రభుత్వంలోనైనా నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి లక్ష, రెండు, మూడు లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయా?. పేదల గుండె చప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ పథకాల ద్వారా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. సంపదను చంద్రబాబు దోచుకుంటే జగనన్న ప్రజలకు పంచి పెడుతున్నాడు. ఇంతటి మేలు చేసిన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడైనా చూశారా?. అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మీ ఆశీర్వాదం కావాలి తల్లీ’ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే ప్రభుత్వం వల్ల కల్గిన లబ్ధి ఎమేరకు జరిగిందో వివరించారు. ప్రతి గడపలోనూ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అక్కా…బాగున్నారా?. మిమ్మల్ని కలిసి రావాలంటూ జగనన్న చెప్పారని ఎమ్మెల్యే వివరించారు. ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.
కొత్త భవనాలను ప్రారంభించిన రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు..!
కందుకూరులో కొత్తగా నిర్మాణం పూర్తయిన సచివాలయం–1,2 భవనాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రం భవనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వ భవనాలను నిర్మించిందని ఎమ్మెలే అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు..