‘గడప గడపకూ మన ‘ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు
జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి
‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం నుంచి ఆయా కుటుంబాలకు కల్గిన లబ్ధిని తెలియజేస్తూ అందుకు సంబంధించిన లబ్ధి పత్రాలను ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అందజేశారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇదే విషయాన్ని చెబుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ పథకాలు
నేరుగా ఇళ్లవద్దకు చేర్చిన దాఖలాలు లేవు. తరచూ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇళ్లకు తిరుగుతూ ప్రజలు యోగక్షేమాలు అడుగుతున్నారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాలంటే పచ్చ కండువా కప్పుకోవాలన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ఒప్పుకుంటేనే పథకాలు వచ్చేవి. మండల స్థాయి అధికారులు చెప్పినా ఉపయోగం ఉండేది కాదు.
జన్మభూమి కమిటీ సభ్యులు కేవలం టిడిపి కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. అర్హత ఉండికూడా పథకాలకు దూరమైన వారు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని ప్రజలే చెబుతున్నారు. వలంటీర్లకు వివరాలు అందజేస్తే వారే
పథకాలు వచ్చేలా చూస్తున్నారు. ఇంతకంటే మాకు ఏం కావాలని గ్రామాల్లో మహిళలు చెబుతున్నారు. అందరి బాగు కోరుకుంటున్న జగనన్నను మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్యేగారు విజ్ఞప్తి చేశారు.