విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చిన ముఖ్యమంత్రి గారూ…హాట్సాఫ్..! రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..!
ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు..!
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పాఠశాలల రూపురేఖలు మార్చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు అన్నారు. ఆత్మకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో నాబార్డ్ నిధులు 1.24 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులను శుక్రవారం ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. కార్పొరేట్ పాఠశాలలను మంచి వసతులు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించారు. జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్థులందరికీ యూనీఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూ, సాక్సులు, బెల్టు ఉచితంగా అందజేశారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంతో నాణ్యమైన, పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందిస్తున్నారు. పిల్లలను బడులకు పంపే కుటుంబాలకు ఆర్థికభారం కాకూడదనే ఉద్దేశంతో ఏడాదికి 15 వేల రూపాయలను అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పిల్లలను పనులకు పంపితే డబ్బులు వస్తాయనే ఆలోచన నుంచి బడికి పంపితే పదికాలాల పాటు అభివృద్ధి చెందేలా తయారవుతారనే విధంగా ప్రభుత్వం తల్లిదండ్రులకు భరోసా ఇస్తోంది. అత్యంత అక్షరాస్యత కల్గిన కేరళ రాష్ట్రం నుంచి ఐఏఎస్ అధికారుల బృందం మన రాష్ట్రానికి వచ్చి ఇక్కడ అమలవుతున్న నాడు–నేడు కార్యక్రమాలను పరిశీలించి అధ్యయనం చేశారు. పిల్లల పట్ల బాధ్యత కల్గి ఉండడంతోనే ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్యం విషయంలోనూ ముఖ్యమంత్రిగారు ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కాలంలో ప్రభుత్వం అందించిన సేవలు దేశం మొత్తం కీర్తించింది. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను స్వయానా ప్రధానమంత్రి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కొనియాడారు. కోవిడ్ మరణాల చాలా తక్కువగా జరిగాయని ఇలాంటి ముఖ్యమంత్రి దేశానికి ఆదర్శం అని అన్నారు. మనసున్న మారాజు అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం ఎలా చూస్తారో ఇదే తార్కాణం. ఇంటర్‌పైన తరగతుల విద్యార్థుల ఫీజు మొత్తం జగనన్నే కడుతున్నారు. వసతి దీవెన కింద ఏడాదికి 20 వేలు ఇస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడి ఐటి ఇంజినీర్లు కాదు ఐటీ కంపెనీలు పెట్టేస్థాయికి మన పిల్లలు ఎదగాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అలాంటి జగన్ మామయ్యకు విద్యార్థులు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ మంచి ర్యాంకులు తెచ్చుకోవడమే.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జె సి ఎస్ ఇన్చార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, పోలింగ్ బూత్ మేనేజర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కన్వీనర్లు, సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పెన్షన్ దారులు మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.