శాంతి సమానత్వాలకు ప్రతీక రంజాన్.. ముస్లిం సోదరులకు ప్రకాష్ రెడ్డి  గారు ఈద్ శుభాకాంక్షలు…

శాంతి సమానత్వాలకు ప్రతీక రంజాన్.. ముస్లిం సోదరులకు ప్రకాష్ రెడ్డి గారు ఈద్ శుభాకాంక్షలు…

Share

శాంతి సమానత్వాలకు ప్రతీక రంజాన్ అని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో భక్తికి, దాతృత్వానికి రంజాన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో శాంతి వర్ధిల్లాలని, ప్రజలందరూ సమభావంతో జీవించాలని ఇస్లాం చెబుతుందన్నారు. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని అల్లాను ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని, ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో మరోసారి అఖండ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.