వాల్మీకి మహర్షి అందరివాడు..!
విశ్వమంతా ప్రభావితం చేయగలిగే వాల్మీకి మహర్షి అందరివాడు అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు. ఆదివారం మండల కేంద్రం రాప్తాడులో వాల్మీకి ఉత్సవ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… ప్రపంచానికి శ్రీరామ చరిత్ర కనులవిందుగా, వినులవిందుగా అందజేసిన గొప్ప రామభక్తుడు వాల్మీకి మహర్షి. ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచారు. ప్రతి ఒక్కరూ రాముడి విధానంలోకి రావాలని కోరుకున్నారు.
ప్రతి ఒక్కరూ రామరాజ్యంను నడిపించాలని, రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచానికి చూపిన వ్యక్తి వాల్మీకి మహర్షి. ఆయన అందరికీ ఆదర్శం కావాలి. ఆయన విధానాలను ప్రతి ఒక్కరూ అవలంబించి మానవతా మూర్తులుగా, గొప్ప రామ భక్తులుగా ప్రపంచానికి ఆదర్శం కావాలి.
వాల్మీకి మహర్షి ఆశీస్సులు రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా.