అందరి క్షేమం కోరే ముఖ్యమంత్రి  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..!

అందరి క్షేమం కోరే ముఖ్యమంత్రి  తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..!

Share

అందరి మేలు కోరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు తెలిపారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ సచివాలయం -3 పరిధిలో బుధవారం ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు. జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, అధికారులు, సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇంటింటికీ తిరిగారు. పైసా అవినీతికి తావులేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు, బలహీన, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పార్టీలు, కులాలు, మతాలు అనేది చూడకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తూ పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వడం లేదు. మంచి చేస్తున్న ముఖ్యమంత్రిపై పనికట్టుకుని దుస్ప్రచారం చేస్తున్నారు. జగనన్న ఉంటేనే అందరికీ మేలు గు జరుగుతుంది. అలాంటి ముఖ్యమంత్రిని మరోమారు ఆశీర్వాదించాలి తల్లీ…అని మహిళలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి “ఎండియు” వాహనంలో రేషన్ బియ్యం తీసుకుంటున్న మహిళలు తారసపడ్డారు. వారితో మాట్లాడిన ఎమ్మెల్యే గారు, ఇంటి వద్దకే వాహనం వస్తోందా? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

పలువురికి ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే..!

అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *