ఆలమూరు జగనన్నకాలనీ పక్కన 11.50 ఎకరాల్లో గార్మెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మించి ఇస్తుంది..!

ఆలమూరు జగనన్నకాలనీ పక్కన 11.50 ఎకరాల్లో గార్మెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మించి ఇస్తుంది..!

Share

ఆలోచన చేయండి. మేలు చేసిన జగనన్నకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించండి..!

రెండెకరాల ఆసామి చంద్రబాబు రెండు లక్షల కోట్లకు ఎలా ఎదిగాడో ఒకసారి ఆలోచించండి..!

చంద్రబాబు దుబారా, అవినీతితో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాడని కేంద్ర ప్రభుత్వ సంస్థ 2018 చివరిలో నివేదిక ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ చంద్రబాబు లక్ష కోట్లు దోపిడీ చేశాడని అన్నారు..!

చియ్యేడు, పూలకుంట, ఉప్పరపల్లి, ఆకుతోటపల్లి, ఇటుకలపల్లి, మన్నీల, కందుకూరు,కక్కలపల్లి గ్రామాల్లో నూతన పింఛన్ల పంపిణీల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు..!

అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు జగనన్న కాలనీ సమీపంలో గార్మెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం 11.50 ఎకరాలు భూమిని కేటాయించింది. ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మిస్తుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో 4 వేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గురువారం అనంతపురం రూరల్‌ మండలము చియ్యేడు, పూలకుంట, ఉప్పరపల్లి, ఆకుతోటపల్లి, ఇటుకలపల్లి, మన్నీల, కందుకూరు, కక్కలపల్లి గ్రామాల్లో నూతన పింఛన్ల పంపిణీల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు పాల్గొన్నారు. పూలకుంట గ్రామంలోని బిసి కాలనీలో 66 లక్షల 77 వేలతో ఏర్పాటు చేసిన తాగనీటి కొళాయి కనెక్షన్, పైపులైను, సిసి డ్రైన్‌ను ఎమ్మెల్యే గారు  ప్రారంభించారు. ఎస్‌సి, ఓసి కాలనీల్లో 33 లక్షల 47 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయి కనెక్షన్లు, సిసి డ్రైన్, సిసి రోడ్డు, కల్వర్టును ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఎన్నికల ముందు ‘నవరత్నాల’ పథకాలు అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారలలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు అమలు చేశారు. అదే చంద్రబాబు 2014 ఎన్నికల ముందు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు, రైతుల రుణాలన్ని మాఫి చేస్తానని హామి ఇచ్చారు. ఏరు దాటేదాకా పదేపదే హామీలు చెబుతూ వెళ్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. లేదంటే ప్రతినెలా 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఆరోజు రైతు రుణాలు రాష్ట్రంలో 84 వేల కోట్లు ఉండేవి.  ఐదేళ్లలో వడ్డీతో కలుపుకొంటే దాదాపు లక్షా 20 వేల కోట్లు అయ్యాయి. ఇందులో రుణమాఫీ కింద 20 వేల కోట్లు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. 50 వేల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశామని చెబుతున్నా…అవి 20 వేల కోట్లు కూడా లేవు. ఐదేళ్లలో అన్ని వర్గాలను నట్టేట ముంచాడు. కాబట్టే 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరించారు. డ్వాక్రా రుణాలు కూడా అసలు వడ్డి కలిపి దాదాపు 15 వేల కోట్లు ఉంటే తీరా ఎన్నికల ముందు పసుపు–కుంకమ పేరుతో 5 వేల కోట్లు ఇచ్చారు. ఆయనను నమ్ముకుని రుణాలు చెల్లించని సంఘాలను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించారు. అక్కచెల్లెమ్మకు మూడు సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి డబ్బులిస్తామని చెప్పాడు. మరి ఎంతమందికి ఇంటిస్థలాలు ఇచ్చాడో ప్రజలకు తెలుసు. ఈరోజు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఏ పథకం తీసుకున్నా…  చంద్రబాబు మోసం చేశాడు. జన్మభూమి కమిటి సభ్యులకు 10 శాతం ఇచ్చి 90 శాతం చంద్రబాబు దోచుకున్నాడు.  రెండెకరాల ఆసామి రెండు లక్షల కోట్లకు ఎలా ఎదిగాడో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. చంద్రబాబు దుబారా, అవినీతితో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టాడని కేంద్ర ప్రభుత్వ సంస్థ 2018 చివరిలో నివేదిక కూడా ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ కూడా మాట్లాడుతూ చంద్రబాబు లక్ష కోట్లు దోపిడీ చేశాడని అన్నారు.

తల్లికి అన్నం పెట్టలేని వ్యక్తి పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడంట ఇలా ఉంది చంద్రబాబు తీరు. 2014 నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయకుండా ఈరోజు మాత్రం బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ అంటూ వస్తున్నాడు. నాకు ఓటేయండి అధికారంలోకి అదిచేస్తా…ఇదిచేస్తానని అంటున్నాడు.

చంద్రబాబు హయాంలో పింఛన్‌ వెయ్యి మాత్రమే ఇచ్చాడు. రాష్ట్రంలో 39 లక్షలమందికి ఇచ్చాడు. ఈరోజు జగనన్న 66 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాడు. నెలకు మూడు ఇస్తున్నాడు. అంటే ఐదురెట్లు ఎక్కువ ఇస్తున్నాడు. ప్రజలకు మంచి చేయాలనే మనసు, సాయం చేయాలనే గుణం ఉంది కాబట్టి జగనన్న చేయగలిగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *