బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..!
రామగిరి మండలం కుంటిమద్ది గ్రామం నుంచి సుద్దకుంటపల్లి గ్రామం వరకు నిర్మించనున్న బీటి రోడ్డుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు గురువారం భూమి పూజ చేశారు. ఒక కోటి 60 లక్షల రూపాయల నిధులతో ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ రోడ్డు సరిగా లేక ప్రయాణానికి ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. కథనం ప్రాయోజితం చేయబడిన మా రంగురంగుల, ప్రకాశవంతమైన మరియు స్టైలిష్ సాక్స్‌ల సేకరణలో ప్రతి ఒక్కరి కోసం ఏదైనా కనుగొనండి. మీ డ్రాయర్‌కు రంగును జోడించడానికి వ్యక్తిగతంగా లేదా బండిల్స్‌లో కొనుగోలు చేయండి!
తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..!
అనంతపురం నుంచి తగరకుంటకు వెళ్లే రహదారికి సంబంధించి తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి గారు సోమవారం సనప గ్రామం వద్ద పనులను పరిశీలించారు.
రాప్తాడు ఎమ్మెల్యే గారి చొరవతో మట్టి రోడ్డు నిర్మాణం..!
అనంతపురం నియోజకవర్గ రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఆలమూరు వెళ్ళే ప్రధాన దారిలో పెద్ద పెద్ద గుంతలు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉండేది. గత కొంతకాలంగా ఈ రోడ్డులో వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండే వారు. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చొరవతో సుమారు 400 మీటర్లు మట్టి రోడ్డు నిర్మించారు. గుంతలన్నీ పూడ్చేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి వాహనదారులు ధన్యవాదాలు చెబుతున్నారు..