ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రకాష్ భాయ్

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రకాష్ భాయ్

Share

ముస్లింలకు అండగా జగన్ ప్రభుత్వం.. రాప్తాడు ముస్లింలకు అండగా ప్రకాష్ భాయ్

రాప్తాడు మండలం చిన్మయినగర్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు వడ్డించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు, జాతిసమైక్యతకు మన దేశం ప్రతీక అని తెలిపారు. హిందూ ముస్లింలు భాయి భాయి అనుకుంటూ మన దేశంలో తరతరాలుగా కలిసి ఉంటున్నామని తెలిపారు. సీఎం జగన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు గత ఐదేళ్లుగా అండగా ఉన్నారని రాజకీయంగా సామాజికంగా ముస్లింలను పైకి తెచ్చారని ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. ముస్లింలలోని అన్ని ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఇమామ్, మౌజములకు గౌరవ వేతనం ఇవ్వడం, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ముస్లిం మహిళలకు సైతం పదవులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్లుగా జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తాను సైతం నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు అండగా ఉంటానన్నారు. ఇస్లాం ప్రకారం, ఈద్-ఉల్-ఫితర్‌కి ఎంతో ప్రాముఖ్యత ఉందని, దీన్నే ఈద్ లేదా రంజాన్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపును వరకూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *