రాప్తాడు “సిద్ధం” సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రివర్యులు రామచంద్ర రెడ్డి గారు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు..!
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనెల 18న రాప్తాడులో నిర్వహించే సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సిఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ రఘురాం, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, శంకర్ నారాయణ, వై. వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి నర్సే గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఇతర ప్రజాప్రతినిధులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సిద్ధం సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.